2014/08/28

తెలుగు వారంతా నీ బిడ్డలే!

అంతరంగాన భాషా ఝరి లో
ఆశువు గా జారిన ప్రతి లలిత పదం 
నీ లాలనలో నా మనసుకు తెలుసు 
అది నీ మునివెళ్ళ తీయదనం..

మమతలు  నిండిన మసుల్లోన
మధుర సరాల మధువులు వొంపి 
పున్నమి నిండా వెన్నెల లాగా  
పెదాల నిండా పదాలు నింపి

అశేష జనాల హౄదయాలనేలి
మది పాలించి మనసు లాలించి
మనసు పలికే భాష -  మనసున్న భాష
అమ్మ నేర్పిన భాష - అమ్మైన భాష

ఇంకెన్ని జన్మలో చెప్పు జననీ
వేయి జనమలు గాని  నీ ఒడిలోనె పుడతాను
అవతారమెత్తితే చెప్పుతల్లీ
నా గారల బిడ్డగా  నిన్ను కంటాను

మాతలని కన్న ఓ భరత మాతా!
మా తెలుగు తల్లి ని చల్లగా చూడు...
ఏ చోటనున్నా తెలుగు వారే అంతా
నీ బిడ్డలే తల్లి,  చేరి కాపాడు....  


-సత్య 

1 comment:

  1. మనసు పలికే భాష - మనసున్న భాష
    అమ్మ నేర్పిన భాష - అమ్మైన భాష
    ------------------------------------------
    అదే మా తెలుగు. విడదీసి ఎలా పంచుకోవాలా అని చూస్తున్న రోజుల్లో, కలిసిపోయి విడదీయలేని వస్తువు గురించి చెప్పారు. కవిత బాగుంది.

    ReplyDelete