"సగటు పాఠకుడు"... సగటు స్థాయిలో ఉంటాడు.. ఇప్పుడు జనాల మీదికి తోలుతున్న సాహిత్య మంత కింది స్థాయిలో కాకుండా, ఒకప్పటి పురాతన సహిత్య మంత గొప్ప స్థాయి లో కాకుండా మధ్యలో సగటుగా నాన్యమైన సాహిత్యాన్ని ఆశిస్తూ ఉంటాడు...ఇప్పటి సాహిత్యం లో నాన్యత లేదు లేదు లేదు ...
** కవిత్వమంటే ఛంధోబద్ధ కవిత్వం మాత్రమే అని ఎవడూ అనడు… వచన కవిత్వం అత్భుతమైన సాహితీ ప్రక్రియ... అందులో ఎలాంటి సందేహమూ లేదు… సాహిత్యానికి కవి పరాకాష్ట!... పాఠకుడు ద్రష్ట!!
** ఇక్కడ కూడా పరిణతి ఉంటుంది... దానికి “మునిగి, తేలాలి! లోతు తెలుసు కోవాలి”!!... సాహిత్యం లో మునగడం సాధన!, సాహిత్యం లో తేలడం జ్ఞానం! సాహిత్యం లోతు తెలుస్కోవడం “పరిణతి”!!... అది ఇప్పటి నవ-కవుల్లో ఎక్కడా కనబడడం లేదు...
** అదే ఒక చిన్న దశావధాని కూడా అవధానానికి పూర్వం రెండు లక్షల పద్యాలని కనీస అధ్యనం చేసి ఉంటాడు...కనీసానికి కనీసఒ 70 వేల గ్రాంధిక పదకోశాగారాన్ని మదిలో నిల్పుకొని ఉంటాడు... కఠొర శ్రమ చేసి ఉంటాడు... అల్లాంటి అధ్యయనం మన నవీన కవులు ఎందుకు చేయరు?అసలు ఎందరు చేసారు? (వేల్ల మీద లెక్క పెట్టే కొందరు తప్ప) .... ఇదే “ప్రమాణం”!!!
** భాష కూకటి వ్రేళ్ళతో కునారిల్లుతున్నదని బాధ పడే వారే ," పదాల పేదోడిగా" పరభాషా పదాలని విర్విగా వాడడం పరిణతి లోపం కాదా?
** భావాలని అందంగా రాసి, ఆ పేరాలని/రాతలని ముక్కలు ముక్కలు గా చేసి కవితలు గా చెప్పుకుంటున్నారు... ఇంతకన్నా దౌర్భాగ్యం భాషాతల్లికి ఏముంటుంది?..
** లోతైన భావాలతో సహా లోతైన భాషకూడా చాలా అవసరం!!. భాషా-భావాల సమతూకం అవసరమే,అదే ఉన్నింటే ఇన్ని విషయాలు చర్చకొచ్చేవే కావు.సాహిత్యం పదాలని సమతూకం తో సమయోచితంగా ధర్భోచితంగా వాడే వాళ్లు మనచుట్టూ చాలానే ఉన్నారు...
** బయటి సాహితీ పుస్తకాల్లో, సహితీ సేవా సంస్థల్లో, సాహితీ వెబ్‌సైట్లల్లో ప్రచురించే కవితలన్నీ దాదాపు గా పరిచయాల ప్రభావాలే తప్ప నిజమైన కళా వేట జరగడం లేదు..(వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని తప్ప )
** కవులని తయారు చేయడం కుదరదు... అది జరగని పని . కవులని (ఏ కళాకారులనైనా) తయారు చెయలేము వారు సహజంగా పుడతారు వారు దాన్ని గుర్తించి సాధన ద్వారా సాన పెట్టుకోవాలి.. ఆతర్వాతే కలం పట్టుకోవాలి అంతే!...వారిని సద్విమర్శ చేసిన వారికి, ప్రోత్సహించినవారికి సాహిత్య లోకం సదా కృతజ్ఞతతో ఉన్నది/ఉంటుంది..
** కాని పాఠకులని మాత్రం తయారు చేయాలి ప్రోత్సహించాలి, వివరించాలి, విశధపరచాలి,మంచి సాహిత్యాన్ని సౌలభ్యం తో ముందు ఉంచాలి...
** అచ్చు వేసుకున్న పుస్తకాలని అమ్ముకోవడం కోసమే, నాతో పరిచయం చేసుకొని... అంటగట్టి... ముఖం చాటేసిన వాళ్లూ ఉన్నారు…
అచ్చు వేసి అమ్ముకోలెక అవస్థని అనుభవించాల్సిన అగత్యం కవికి ఎందుకు దాపురించింది...? … (సాహిత్యాన్ని వ్యాపార వ్యవహారాల్లో ఇరికించడం )
** వాదాలకి,కులాలకి, మతాలకి, సిద్ధాంతాలకి, రాజకీయాలకి, రభసలకి, దాడికి, నవీన సాహిత్యాన్ని ఓ పావుగా వాడుకుంటున్నారు కొందరు ... ఇది ఇంకో దౌర్భాగ్యం..ఉసిగొల్పడం,రెచ్ఛగొట్టడం, అశాంత పరచడం,అయోమయ పరచడం, దారి మళ్ళించడం, ద్వేషం నింపడం ఇవే వారి పనులు ... ఇది స్పష్టంగా కనపడే జ్ఞాన లోపం. శాంత పరచడం, స్వాంతన నివ్వడం, సమాధాన పరచడం, దారి చూపడం, ప్రేమ పంచడం చాలా కొద్ది మందే చేస్తున్నారు…
** భాషా ప్రాభవాన్ని తగ్గించి,ఓ మెట్టు దిగజార్చి... సౌలభ్యం, సౌకర్యం, సరళత్వం అని పెట్టిన పేర్లు చాలు!... పాఠకుడు ఎప్పుడూ నాన్యతనే కోరుకుంటాడు.
** అయినా ఈ భాధంతా పాఠకులది...రాతలు రాసి జనామీది తోలేవాళ్ళది కాదు...
** మొత్తం మీద మిఠాయిలు చేయడం రాక , మిఠాయిల పేర్లు తెలుసుకోక, న్యూనత తో "నేరుగా చక్కెర బుక్కితే చాలు ఇన్ని మిటాయిలెందుకు?" అనే వాళ్ళకి తీపి ఒకటే అయినా మాధుర్యాలు వేరు అని ఎప్పుడు తెలిసేది ?
** జనం కోసం,చైత్యన్యం కోసం మార్పుకోసం ఇప్పుడు వస్తున్న్న నవీన సాహిత్యం పామరునిపై ఒకప్పటి సుమతీ-వేమన-నార్ల శతకాలంత ప్రభావం ఎందుకు చూపలెకపోతుంది?...సుమతీ-వేమన శతకాలంత బాగా నవీన కవితా -సందేశాలు ఎంతమంది కి గుర్తున్నాయి?...ఎంతమంది నోటిలో నానుతున్నాయి? అసలు, పామరున్ని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు...అయితే సగటు పాఠకుడు రోగి-స్థాయిలో ఉన్నాడంటారా?
** అందనిది అర్థం కానిది, ఇంకా చేతకానిది, చాదస్తమే కొoదరికి ! వీరెప్పుడూ ఆస్థాయిలోనే ఉంటారు మారరు !
-satya
Note: *** above points are not applicable to all … I just want to say that, if It is inappropriate,if they hurt anybody, I would like to express my deep regrets for it, and apologize for my points. but I don't think so! ..