2011/02/14

బిడల్లారా!! సీతనైన నేను వాత్సల్యం తో నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా!








బిడల్లారా!! సీతనైన నేను వాత్సల్యం తో  నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా! 


నాకు లేని భాధ వీళ్ళకెందుకో అర్థం కావడం లేదు...


కలికాలం అంటే ఇదేనేమో...


రాముడు ధర్మ పరాయణుడు, అతనికి రాజుగా రాజధర్మమే పరమావధి.రాముని మీద నాకెలాంటి అలకలు, అనుమానాలు, ఫిర్యాదులూ లేవు, ఎందుకంటే మా తనువులు వేరైనా మనసులు ఒక్కటే. నేనేనాడూ తన నిర్ణయాన్ని అడ్డుబడలేదు ఎందుకంటే రాముని అంతరంగం నాకు తెలిసినంత బాగా ముల్లోకాలలో ఎవరికీ తెలియదు...మేము పరస్పరం మాటలతో మాట్లాడుకోము ప్రవర్తనతో మాట్లాడుకుంటాం! అవగాహన తో ప్రేమలతో మాసలుకుంటాం!


రాముని ఎడబాటుని తట్టుకోలేక రోధించానే గాని , నన్ను అడవులకి పంపాలన్న రాముని నిర్ణయం పై నాకెలాంటి ఫిర్యాదులూలేవు.
ధర్మమెంత సున్నిత మైనదో అంత కఠినమైనది...అది మా ఇద్దరికీ,అయోధ్యా రాజ్య, రాజు-రాణిగా రాచరికమైన బాధ్యతలు బాగా తెలుసు.


రాముడు అడవులకి పంపాలన్న కఠిన మైన న్నిర్ణయాన్ని, ప్రియసఖినైన నా సుముఖాన ప్రకటించలేక లక్ష్మణునితో చెప్పించాడు. అంతే కానీ, నాకు తెలిపితే నేను రాముని నిర్ణయాన్ని ఒప్పుకోనని, అడ్డుచెబుతానని కాదు....అడవుల్లో నేనెంత భాధలనుభవించానో  నారామచంద్రుడు అంతకంటే ఎక్కువ క్షోభని అనుభవించాడని నాకు తెలుసు.


నేను క్షత్రయ వనితని! ఆడుతూ, పాడుతూ శివ ధనస్సుని అవలీలగా పక్కకు జరిపిన దానని...నెను  అడవిలో ఎలా బతకాలో నాకెవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు..12 సంవత్సరాల అనుభవం కూడా ఉన్నదానని..


రామచంద్రునితో దాదాపు 10,000 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కాపురం చేసిన దానిని!! (దశరథుని వయసు ౬౨౦౦౦ సంవత్సరాలు, రావణుని వయసు ౨౧౦౦౦ సంవత్సరాలు, జఠాయువు వయసు ౬౦ వేల సంవత్సరాలు)


నాకు రాముడేంటో, రామరాజ్యం ఎలావుంటుందో, ఇక్కడి ప్రజలు, జీవన విధానం, రాజ్య పాలనా - నియమాలు, విరాట్ అయోధ్య పట్టమహిషిగా రాముడితో సమానంగా, నాకు బాగా తెలుసు....


"చాకలి చాడీ విషయం"  నా దృష్టికి ముందే వచ్చివుంటే, బాధ్యతాయతమైన పట్టమహిషిగా, మహారాణిగా  నేనే ముందుగా రాజ్య నిష్క్ర్రమణ నిర్ణయం తీసుకునేదానని... మా మధ్యలో ఉండే పరస్పర అవగాహన అలాంటిది (mutual understanding). అప్పుడు రాముడు కూడా బాధపడినా అడ్డు చెప్పేవాడు కాదేమో ...అర్థం చేసుకోండి.


మా వివాహం తరువాత 10 సంవత్సరాలు గదిచినపిమ్మట మేము అడవులకేగినాము..తరువాత 12 సంవత్స్రరాలు రామునితో నే ఉన్నా ఏడబాటు కేవలం ఒక సంవత్సరం లొబడి కాలమే..అంటే వివాహానంతరం మేము మెత్తం దాదాపు 22 సంవత్స్రాలు కలిసే వున్నాము. సుఖంగా వున్నాము .... రావణుడి చెర నుండి విడివడిన తరువార 10,000 సంవత్సరాల సౌక్యమైన సంసారం మాది.. యుగాలు దాటినా మమ్ములని కొలువడానికి కారణం మా ఆదర్శదాంపత్యమే!


ఎవరో అన్నట్లూ, నా జీవితమంతా కష్టాలు లేవు...కాని వచ్చిన కష్టాలు చిన్నవి కూడా కావు...అది నా రామునికి బాగా తెలుసు...


 రాముడు రాజధర్మంలో, నేను అడవుల్లో  12 సంవత్సరాలు ’విడిగా ఉన్నామంతే....విడిపోలేదు ’...సీత నుండి రామున్ని వేరుచేయడం శతకోటి రావణ బ్రహ్మలు , సహస్ర కోటి సూర్పనఖలు ఏకమైనా జరగని పని.


మీరన్నట్టు రావణుని నుండి నాకు నెను గా బయట పడేదాననే....
అంతెందుకు నేను అశొక వనం లో ఉండగా నాబిడ్డ హనుమ నన్ను వీపుమీద మోసుకొని రామునిదగ్గరకి తీసుకెలతానన్నాడు...కాని నేను వారించాను..తనని విడిపించడం భర్తగా రాముని  ధర్మం ..నేను రాముని ధర్మానికి ఏమాత్రం అడ్డు పడను అని స్పష్టం చేసాను... అదే హుందాగా జరగాల్సిన పని! ...నేను రావణుని చెర నుంది పారపోయి వచ్చినా అయోధ్యా మహారాణి నైన నాకు ఇంకెన్ని అపవాదులొచ్చేవో ?!! నారాముని మనసు నొప్పించిన దాననౌతాను ... ఈ సూక్ష్మం  నారామునికి బాగా తెలుసు... మీకూ తెలుపనవసరం లేదు.




రావణుని చెర విడిపించిన తరువాత లోకులనెలా ఒప్పించాలన్న సంశయం రామునిది, నామిద రామునికి ఏనాడూ సంశయం లేదు...ఉంటే అతను రాముడు కాడు.
 అగ్ని ప్రవేశం రాముని నిర్ణయం కాదు..నేను తీసుకున్న నిర్ణయం..నా స్వతంత్రానికి ఏనాడు నా రాముడడ్డు చెప్పలేదు..అయినా అది మీకర్థం కాదు..

రెండవ విషయం ఊర్మిలా దేవి గూర్చి...నేనే సీతనైతే నా చెల్లి ఇంకెంత పతీవ్రత అయ్యుండాలి?...
లక్ష్మణుడు 14 సంవత్స రాలు నిద్ర, ఆహారం మాని ధీక్షగా రామున్ని సేవించికుంటానని ప్రతిన బూనగా...అందుకు లక్ష్మణుని నిద్రని, ఆకలిని తను స్వీక రించింది ఊర్మిలాదేవి...అడ్డుకూడా చెప్పలేదు...అంతేకాదు అది అలసత్వం వచ్చే నిద్దుర కాదు....అవేదనతో వచ్చే విరహం ... పతి కనపడని ప్రపంచాన్ని దర్శించడం ఇష్టం లేని పరమోత్కృషమైన నిద్రా-విరహస్థితి..(sleepy - depression )..మీకెప్పుడర్థమయ్యేది...




ఇదంతా ఎవరి వైపరిత్యమైన ప్రశ్నల జవాబుగానో తెలుపడం లేదు....
"నా బిడ్డలు అపోహ, బ్రమలో బ్రతకవద్దని...
అబద్దాలని నిజాలలా అతకవద్దని....వద్దని" వారించడానికి చెబుతున్నా....




ముందు మా రామాయణాన్ని చదవండి...సవివరంగా అర్థం చేసుకోండి.........


చీకటిలో వస్తువుచూడాలంటే మనకు వెలుగు కావాలి...ఒకరి తప్పుని ఎత్తి చూపాలంటే మనం ముందు ’ఒప్పుగా’ మారాలి



"ఒకసమయంలో ఒకే విషయం పై ఒకే ఉద్దేశ్యముంటే దానిని స్పష్టత అంటారు...
కాలానికతీతంగా స్పష్టత వుంటే దానిని పవిత్రత అంటారు"...


స్పష్టతని తెచ్చుకోండి ..... పవిత్రులుకండి!

***********************




(ఈ టపా రాస్తున్నంత సేపూ నా కళ్ళు చెమ్మతో నే వున్నాయి....ఆ నీచమైన  భగవద్దూషణని ఎవ్వరూ ఆపలేరా!!...హిందువులు అంత అసమర్థులా? --సత్య)



2011/02/13

భీష్మ ....ధర్మ పరిరక్షణ, నిత్య సంఘర్షణ.











సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం  ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".
రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.
ధర్మ పరిరక్షణం కోసం  ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .
జీవితమంతా కష్టాలే.  అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.  
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది. 
కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.
ప్రతిజ్ఞ అంటే  'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.
భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.
ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’  భీష్మునిది.


అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.
ధర్మరాజే  ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..
స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.


కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ  రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో, 
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది.




విష్ణువు ముందే  విష్ణువు  ఆధ్వర్యంలోనే పాండవులకి  ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.


ఆ విశిష్ట ధర్మ పరాయణుని అడుగుజాడలు సదా నా మదిలో.... అలాంటి పెద్దల పాద ధూలి సదా నా శిరస్సు పై ఉండును గాక.


-సత్య 








||  శ్రీకృష్ణా శరణంమమ  ||