తడిసిన
కన్నుల
ధ్యానము ...
కృష్ణా
నీమీది
మోహము ...
ఎడబాటు
మంటల
దాహము ...
కుదురుకున్న
ఎదురుచూపు
వెదురైపోతే ...
నిదురంతా
నీ తోనే
కలైపోతే...
ఆవేదనతో
తనువెల్లా
కాలిపోతే...
నివేదనతో
అంతరంగం
ఖాళీ ఐపోతే...
ఆలాపన
గాయాల్లోంచి
రాగము ..
బ్రతుకు
విరహ
గానము ...
నీ ప్రేమే
అమ్రృత
పానము ...
--సత్య