కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
మారిందీ లేదూ మార్చిందీ లేదు
బతుకులో విలివల్ని కూర్చింది లేదు
పిలిచిందీ లేదు పలికిందీ లేదు
ఆర్తులకి హస్తాన్ని చాచింది లేదు
నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
కదిలిందీ లేదు కదిపిందీ లేదు
జడమైన హృదయాల కుదుపింది లేదు
తెలిసిందీ లేదు తెలిపేదీ లేదు
మనసుల్నీ తట్టీ ఆడిగింది లేదు
నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
కోరిందీ లేదు ఇచ్చిందీ లేదూ
పదాల ప్రశాంతత తెచ్చిందీ లేదు
అక్షరాలు అందుకున్న ఆదర్శము
ఆచరణకి మాత్రం అందినది లేదు
నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
జనాల కళ్ళల్లో, జనాల మెప్పులు ,
చూసుకోవడం తప్ప మురిసిపోవడం తప్ప
అశ్రువుల తడినీ తాకిందీ లేదు
అంతరంగం లో తొంగి చూసింది లేదు
నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
ఏవి? పెదాలపైన పదాలేగాని
గుండెల్లో దాగిన భావాలు... ఏవి ?
సున్నిత భావాల హృదయాల దూరాల
ఎడబాటు యాతనల విరహాలు... లేవి?
నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
-సత్య