2013/04/30

కవిత్వమంతా మూర్ఖత్వమే ....

కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే


మారిందీ లేదూ మార్చిందీ లేదు
బతుకులో విలివల్ని కూర్చింది లేదు
పిలిచిందీ లేదు పలికిందీ లేదు
ఆర్తులకి హస్తాన్ని చాచింది లేదు


నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే

కదిలిందీ లేదు కదిపిందీ లేదు
జడమైన హృదయాల కుదుపింది  లేదు
తెలిసిందీ లేదు తెలిపేదీ లేదు
మనసుల్నీ తట్టీ ఆడిగింది  లేదు  


నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే


కోరిందీ లేదు ఇచ్చిందీ లేదూ 
పదాల ప్రశాంతత తెచ్చిందీ లేదు 
అక్షరాలు అందుకున్న ఆదర్శము
ఆచరణకి మాత్రం అందినది లేదు


నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే

జనాల కళ్ళల్లో, జనాల మెప్పులు ,
చూసుకోవడం తప్ప మురిసిపోవడం తప్ప 
అశ్రువుల తడినీ తాకిందీ   లేదు 
అంతరంగం లో తొంగి చూసింది లేదు  


నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమేఏవి? పెదాలపైన  పదాలేగాని  
గుండెల్లో దాగిన భావాలు...  ఏవి ?
సున్నిత భావాల  హృదయాల దూరాల 
ఎడబాటు  యాతనల  విరహాలు... లేవి? 


నా కవిత్వమంతా మూర్ఖత్వమే
మాటలు పెంచిన మమత్వమే
-సత్య 

7 comments:

 1. ilaanti kavithalu enduku raayatam ...parokshangaa labo dibo manekannaa aa asalaina kavithaagni ruchi choopinchnadi ledaa rayakandi ............??

  ReplyDelete
  Replies
  1. అగ్ని ని ఎవ్వరూ రుచి చూడలేరేమో? .. :) :) :)

   ఏది ఏమైనా మీ సలహా కి ధన్యవాదాలు ...

   -satya

   Delete
 2. In this poetry love & affection for poetry is pervading.You are striving for the upliftment of poetry>you plead for a bridge for what we say & what we do.You should drip your pen in the heart s blood & write poetry!

  ReplyDelete
 3. భావాలతో గుండెల్ని
  కదిలించక పోయినా

  ఎడబాటు యాతనలు
  వివరించక పోయినా

  కవిత్వం కాదా?

  ReplyDelete

 4. లక్క రాజు గారు ధన్యవాదాలు...


  చదివే వాన్ని ఆలోచింపజేయడం తప్పనిసరి చేసేది కవిత్వం ( నా ఉద్దేశ్యం లో)

  ఇంకా చాలా షరతులు పెట్టాను (పెట్టుకున్నాను ) చూడండి.. :)

  -సత్య

  ReplyDelete
 5. నిదుర పట్టక నే "నెట్టు" లో ఉంటి
  కవిత కన్నెకు నేడు కోప మొచ్చింది
  షరతు లెన్నో పెడితే కదలి రానంది

  సుబ్బరంగా వ్రాసేయ్యండి. భావాలు బయటికి ఎలా వస్తయ్యో చెప్పలేము.

  ReplyDelete