2011/02/14

బిడల్లారా!! సీతనైన నేను వాత్సల్యం తో నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా!
బిడల్లారా!! సీతనైన నేను వాత్సల్యం తో  నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా! 


నాకు లేని భాధ వీళ్ళకెందుకో అర్థం కావడం లేదు...


కలికాలం అంటే ఇదేనేమో...


రాముడు ధర్మ పరాయణుడు, అతనికి రాజుగా రాజధర్మమే పరమావధి.రాముని మీద నాకెలాంటి అలకలు, అనుమానాలు, ఫిర్యాదులూ లేవు, ఎందుకంటే మా తనువులు వేరైనా మనసులు ఒక్కటే. నేనేనాడూ తన నిర్ణయాన్ని అడ్డుబడలేదు ఎందుకంటే రాముని అంతరంగం నాకు తెలిసినంత బాగా ముల్లోకాలలో ఎవరికీ తెలియదు...మేము పరస్పరం మాటలతో మాట్లాడుకోము ప్రవర్తనతో మాట్లాడుకుంటాం! అవగాహన తో ప్రేమలతో మాసలుకుంటాం!


రాముని ఎడబాటుని తట్టుకోలేక రోధించానే గాని , నన్ను అడవులకి పంపాలన్న రాముని నిర్ణయం పై నాకెలాంటి ఫిర్యాదులూలేవు.
ధర్మమెంత సున్నిత మైనదో అంత కఠినమైనది...అది మా ఇద్దరికీ,అయోధ్యా రాజ్య, రాజు-రాణిగా రాచరికమైన బాధ్యతలు బాగా తెలుసు.


రాముడు అడవులకి పంపాలన్న కఠిన మైన న్నిర్ణయాన్ని, ప్రియసఖినైన నా సుముఖాన ప్రకటించలేక లక్ష్మణునితో చెప్పించాడు. అంతే కానీ, నాకు తెలిపితే నేను రాముని నిర్ణయాన్ని ఒప్పుకోనని, అడ్డుచెబుతానని కాదు....అడవుల్లో నేనెంత భాధలనుభవించానో  నారామచంద్రుడు అంతకంటే ఎక్కువ క్షోభని అనుభవించాడని నాకు తెలుసు.


నేను క్షత్రయ వనితని! ఆడుతూ, పాడుతూ శివ ధనస్సుని అవలీలగా పక్కకు జరిపిన దానని...నెను  అడవిలో ఎలా బతకాలో నాకెవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు..12 సంవత్సరాల అనుభవం కూడా ఉన్నదానని..


రామచంద్రునితో దాదాపు 10,000 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కాపురం చేసిన దానిని!! (దశరథుని వయసు ౬౨౦౦౦ సంవత్సరాలు, రావణుని వయసు ౨౧౦౦౦ సంవత్సరాలు, జఠాయువు వయసు ౬౦ వేల సంవత్సరాలు)


నాకు రాముడేంటో, రామరాజ్యం ఎలావుంటుందో, ఇక్కడి ప్రజలు, జీవన విధానం, రాజ్య పాలనా - నియమాలు, విరాట్ అయోధ్య పట్టమహిషిగా రాముడితో సమానంగా, నాకు బాగా తెలుసు....


"చాకలి చాడీ విషయం"  నా దృష్టికి ముందే వచ్చివుంటే, బాధ్యతాయతమైన పట్టమహిషిగా, మహారాణిగా  నేనే ముందుగా రాజ్య నిష్క్ర్రమణ నిర్ణయం తీసుకునేదానని... మా మధ్యలో ఉండే పరస్పర అవగాహన అలాంటిది (mutual understanding). అప్పుడు రాముడు కూడా బాధపడినా అడ్డు చెప్పేవాడు కాదేమో ...అర్థం చేసుకోండి.


మా వివాహం తరువాత 10 సంవత్సరాలు గదిచినపిమ్మట మేము అడవులకేగినాము..తరువాత 12 సంవత్స్రరాలు రామునితో నే ఉన్నా ఏడబాటు కేవలం ఒక సంవత్సరం లొబడి కాలమే..అంటే వివాహానంతరం మేము మెత్తం దాదాపు 22 సంవత్స్రాలు కలిసే వున్నాము. సుఖంగా వున్నాము .... రావణుడి చెర నుండి విడివడిన తరువార 10,000 సంవత్సరాల సౌక్యమైన సంసారం మాది.. యుగాలు దాటినా మమ్ములని కొలువడానికి కారణం మా ఆదర్శదాంపత్యమే!


ఎవరో అన్నట్లూ, నా జీవితమంతా కష్టాలు లేవు...కాని వచ్చిన కష్టాలు చిన్నవి కూడా కావు...అది నా రామునికి బాగా తెలుసు...


 రాముడు రాజధర్మంలో, నేను అడవుల్లో  12 సంవత్సరాలు ’విడిగా ఉన్నామంతే....విడిపోలేదు ’...సీత నుండి రామున్ని వేరుచేయడం శతకోటి రావణ బ్రహ్మలు , సహస్ర కోటి సూర్పనఖలు ఏకమైనా జరగని పని.


మీరన్నట్టు రావణుని నుండి నాకు నెను గా బయట పడేదాననే....
అంతెందుకు నేను అశొక వనం లో ఉండగా నాబిడ్డ హనుమ నన్ను వీపుమీద మోసుకొని రామునిదగ్గరకి తీసుకెలతానన్నాడు...కాని నేను వారించాను..తనని విడిపించడం భర్తగా రాముని  ధర్మం ..నేను రాముని ధర్మానికి ఏమాత్రం అడ్డు పడను అని స్పష్టం చేసాను... అదే హుందాగా జరగాల్సిన పని! ...నేను రావణుని చెర నుంది పారపోయి వచ్చినా అయోధ్యా మహారాణి నైన నాకు ఇంకెన్ని అపవాదులొచ్చేవో ?!! నారాముని మనసు నొప్పించిన దాననౌతాను ... ఈ సూక్ష్మం  నారామునికి బాగా తెలుసు... మీకూ తెలుపనవసరం లేదు.
రావణుని చెర విడిపించిన తరువాత లోకులనెలా ఒప్పించాలన్న సంశయం రామునిది, నామిద రామునికి ఏనాడూ సంశయం లేదు...ఉంటే అతను రాముడు కాడు.
 అగ్ని ప్రవేశం రాముని నిర్ణయం కాదు..నేను తీసుకున్న నిర్ణయం..నా స్వతంత్రానికి ఏనాడు నా రాముడడ్డు చెప్పలేదు..అయినా అది మీకర్థం కాదు..

రెండవ విషయం ఊర్మిలా దేవి గూర్చి...నేనే సీతనైతే నా చెల్లి ఇంకెంత పతీవ్రత అయ్యుండాలి?...
లక్ష్మణుడు 14 సంవత్స రాలు నిద్ర, ఆహారం మాని ధీక్షగా రామున్ని సేవించికుంటానని ప్రతిన బూనగా...అందుకు లక్ష్మణుని నిద్రని, ఆకలిని తను స్వీక రించింది ఊర్మిలాదేవి...అడ్డుకూడా చెప్పలేదు...అంతేకాదు అది అలసత్వం వచ్చే నిద్దుర కాదు....అవేదనతో వచ్చే విరహం ... పతి కనపడని ప్రపంచాన్ని దర్శించడం ఇష్టం లేని పరమోత్కృషమైన నిద్రా-విరహస్థితి..(sleepy - depression )..మీకెప్పుడర్థమయ్యేది...
ఇదంతా ఎవరి వైపరిత్యమైన ప్రశ్నల జవాబుగానో తెలుపడం లేదు....
"నా బిడ్డలు అపోహ, బ్రమలో బ్రతకవద్దని...
అబద్దాలని నిజాలలా అతకవద్దని....వద్దని" వారించడానికి చెబుతున్నా....
ముందు మా రామాయణాన్ని చదవండి...సవివరంగా అర్థం చేసుకోండి.........


చీకటిలో వస్తువుచూడాలంటే మనకు వెలుగు కావాలి...ఒకరి తప్పుని ఎత్తి చూపాలంటే మనం ముందు ’ఒప్పుగా’ మారాలి"ఒకసమయంలో ఒకే విషయం పై ఒకే ఉద్దేశ్యముంటే దానిని స్పష్టత అంటారు...
కాలానికతీతంగా స్పష్టత వుంటే దానిని పవిత్రత అంటారు"...


స్పష్టతని తెచ్చుకోండి ..... పవిత్రులుకండి!

***********************
(ఈ టపా రాస్తున్నంత సేపూ నా కళ్ళు చెమ్మతో నే వున్నాయి....ఆ నీచమైన  భగవద్దూషణని ఎవ్వరూ ఆపలేరా!!...హిందువులు అంత అసమర్థులా? --సత్య)52 comments:

 1. $సత్య గారు
  సీతమ్మ తల్లి తన కథని,వ్యధని మీ ద్వారా చక్కగా చెప్పారు.

  #చీకటిలో వస్తువుచూడాలంటే మనకు వెలుగు కావాలి...ఒకరి తప్పుని ఎత్తి చూపాలంటే మనం ముందు ’ఒప్పుగా’ మారాలి

  గుడ్డివాడు కూడా మనసుపెడితే వెలుగుని అనుభవించగలడు. కానీ కళ్ళుండీ మంచి చూడలేని "ఈ" కబోదులు రావణాదిశూర్ఫణక అనుంగులు

  #టపా రాస్తున్నంత సేపూ నా కళ్ళు చెమ్మతో నే ..
  నాక్కూడా చదివినంతసేపు..

  ReplyDelete
 2. అబ్బ, చదువుతుంటేనే కళ్ళలో చెమ్మ కదలాడింది! ఎంత చక్కగా రాశారు? సాక్షాత్తూ సీతాదేవి పవిత్రమైన ప్రశాంతమైన మోముతో కళ్ళముందు కదలాడింది.

  మామూలు మనుషులమైన మనకు కనీసం సీత పటం ముందు నిల్చునే అర్హత ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళం మనం! అలాటిది ఏకంగా సీత పాత్రివ్రత్యంతో పోల్చుకోవడమూ, సీత ని అవమానించడమూ! మనుషులుగా తగని పనులు!

  ఆ సీత తన సహనంతో, ప్రేమతో,వాత్సల్యంతో వీరి అజ్ఞానాన్ని క్షమిస్తుందని ఆశిద్దాం!

  హిందువులు అసమర్థులు కారు. కానీ మానసిక అసమతౌల్యంతో పరుగెత్తేవాళ్ళని హిందువులేమిటి, ఎవరూ అడ్డుకోలేరు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, మానసికారోగ్యానికి సంబంధించిన విషయం! ఆరోగ్యం చక్కబడితే అన్నీ సర్దుకుంటాయి.

  మీ పోస్టు మాత్రం పది కాలాలపాటు దాచుకోవాలనిపించేలా ఉంది.

  ReplyDelete
 3. చాలా బాగా చెప్పారు సత్యగారు.... సాక్షాత్ ఆ సీతాదేవే చెప్పినట్టువుంది.

  ReplyDelete
 4. ఆమెను చూసి జాలిపడటం తప్ప ఏం చేయగలం.భగవంతుడు ఆమెకు మానసిక ఆరోగ్యం కలిగించాలని కోరుకుందాం .అమ్మలగన్న అమ్మ సీతమ్మ .ముల్లోకాలను జయించిన రావణుడు తన సర్వ సంపదను ఆమె కాళ్ళ ముందు పెట్టి దాసోహం అవుతాను అని అంటే గడ్డిపోచను చూపిన మహా ఇల్లాలు.కొడుకుతో సమానం అయిన హనుమను తాకాల్సి వస్తుంది అన్న భయం,రామ చంద్ర ప్రభువుకు మచ్చ రాకూడదన్న తలంపుతో రాముడు వచ్చి ఆమెను తీసుకువెళ్ళేవరకు వేచి ఉన్న సాధ్వి తో పోల్చుకున్న ఆమెను చూసి జాలిపడి వదిలేద్దాం.

  ReplyDelete
 5. ఎంతో చక్కగా చెప్పారు. ఇక తన బిడ్డలు అసమర్ధులు కారు అని తెలియచెప్పవలసిన బాధ్యత మనమీద ఉంది.

  ReplyDelete
 6. నిహారికగారు నన్ను మన్నించండి...ఈ పోస్టు లో మీ అస్థిత్వం తో వచ్చే కామెంట్‌లన్నింటి నేను నిరాకరిస్తున్నా, ధిక్కరిస్తున్నా....ఛీత్కరిస్తున్నా....

  don't send again...

  ReplyDelete
 7. చీకటిలో వస్తువుచూడాలంటే మనకు వెలుగు కావాలి...ఒకరి తప్పుని ఎత్తి చూపాలంటే మనం ముందు ’ఒప్పుగా’ మారాలి....చాలా బాగా చెప్పారు సత్యగారు.... సాక్షాత్ ఆ సీతాదేవే చెప్పినట్టువుంది.

  ReplyDelete
 8. మీ అస్థిత్వం తో వచ్చే కామెంట్‌లన్నింటి నేను నిరాకరిస్తున్నా, అవును, అందరూ చేయాల్సిన పని ఇదే! బహిష్కరణ ..

  ReplyDelete
 9. ఎంతా మాత్రము, చింతింప తగదు సీతమ్మ తల్లి ఎంత మాత్రము
  దశాకంఠుడైనా వాడితాతనైనా... ఆ..దశాకంఠుడైనా వాడితాతనైనా
  పిసికిపిండి చింతింప తగదు సీతమ్మ తల్లి ఎంత మాత్రము

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 11. baga rasarandi.... chala vishayalu thelusu kunnanu...

  ReplyDelete
 12. నీల హంస గారు .. ఇంత చక్కగా చెప్పారు అసలు అర్ధం చేసుకునేంత బుర్ర ఎదుటి వారికి ఉందొ లేదో నాకు తెలీదు ..
  సీతమ్మ తల్లిని అలా అనడం ఏదో గొప్ప అని అనుకునే జనాలు .. వారి పాపులారిటీ కోసం ఎంతకైనా దిగ జారుతున్నారు ...
  ఇదంతా చూస్తూ ఏం చెయ్యలేకపోతున్నం అనే బాధ .. మీరు రాసింది చదివాకా నిజంగా నాకు చాలా ఆనందం గా అనిపించింది ..
  ఇది చదివాకా అయిన .. జనాలకి బుద్దోస్తుందేమో చూడాలి ...

  ReplyDelete
 13. సత్యగారూ నా కామెంట్ లో ఏదయినా పొరపాటు ఉందా? ఎందుకు తొలగించారో అర్ధం కాక అడుగుతున్నాను. ఆ బ్లాగరు చికిత్సకయ్యే వ్యయం చందాల రూపంలో భరిద్దామని నేను సరదాగా అనలేదండీ. I AM SERIOUS ABOUT IT. మీకు అందులో ఏదయినా అసంబద్ధంగా అనిపిస్తే క్షంతవ్యుడను.

  ReplyDelete
 14. శంకర్ గారు..మన్నించాలి!

  ఇంతవరకూ పాఠకులుగా మనం(కొందరు) చేసినదేంటంటే...

  " రచ్చ చేసేవాళ్ళని ...రెచ్చగొట్టడం!...."...

  పరిస్థితి ఇంతదాకా రావడానికి ఉన్న కారణాలలో ఇదీ ఒకటి...

  నిజంగా మీరన్నదే అదే పరిష్కారమైతే నేను రాజపొషకున్నవుతా!...

  అసలు ఇది ఎవరి వ్యక్తిగతమైన విషయం కాదు...

  ReplyDelete
 15. ఈ టపా చదివాకా ఆ పిచ్చిది ఇంకా రెచ్చిపోతుంది. తదుపరి టపా ఈ వ్యాసకర్త మీదే కావచ్చు .

  ReplyDelete
 16. నిజమే పిచ్చివాళ్ళయితే చేయవచ్చు...పరిణతి (meturity)ఉన్నవాళ్ళెవ్వరూ అలాంటి పని చెయరు.

  ReplyDelete
 17. chala baga chepparandi
  seethamma thalle vachi cheppinatlu undi
  nakaithe konni kothavi kuda telisayee
  ramayanam chadivana kuda seethamma ki anni kastale ani nenu anthe anukunna, ipude telisindi anni kastalu kaadu ani,
  vallu matalatho kaadu pravarthana tho matladukuntaru ani cheppatam, next sleepy depression ani urmila devi gurinchi cheppatam kuda chala bavundi, meeru cheppina theeru chala bavundi sunnithamga chala bavundi, chadivaka msg pettalanipinchindi, idhi meeru publish cheyakkarledu kuda

  ReplyDelete
 18. అగ్రిగేటర్లు అందరూ ఎందుకని మౌనంగా ఉన్నారు? హిందూ మతాన్ని ఒకరు ద్వేషంతో అధోగతిపాలు చేస్తుంటే ఇంకా ఎం ఆలోచిస్తున్నారు? మెజారిటీ బ్లాగర్ల అభిప్రాయాన్ని ప్రామాణికం గా తీసుకుని ఇటువంటి బ్లాగులను తొలగించలేరా?

  ReplyDelete
 19. శంకర్ గారు నిజంగా ..దయచేసి ఏమీ అనుకోవద్దు...

  ReplyDelete
 20. చక్కగా చెప్పారు.

  'చేటు కాలము వచ్చెరా నీకు చెడ్డబుద్ధులు పుట్టెరా
  తల్లి సీతను బట్టిన ..'

  ఏడు తరాల వరకూ ఈ పాపం వెంటాడుతుంది, వూరికే పోదు.

  పదిమందిని ఆకట్టుకునే ప్రతిభ ఆమెకు ఎలాగూ లేదు. చక్కగా రాస్తున్న ఆడ బ్లాగర్లంటే ఓ రకమైన ఈర్ష్య. ఏదో బ్లాగుల్లో చీప్ పాపులారుటీ కోసం ఇలా ... అనుకున్న పాపులారిటీ వచ్చింది కాని పరువు బజారున పడింది అన్న స్పృహ కూడా లేదేమో.

  ఆమె కామెంట్లను సంస్కారులైన బ్లాగర్లెవరూ తమ బ్లాగుల్లో అనుమతించకూడదు.

  ReplyDelete
 21. ఆమె కామెంట్లను సంస్కారులైన బ్లాగర్లెవరూ తమ బ్లాగుల్లో అనుమతించకూడదు.
  correct

  ReplyDelete
 22. అయ్యో భలే వాళ్ళే. మీరు చెప్పింది నాకు అర్ధమయిందండీ. ఏం పరవాలేదు.

  ReplyDelete
 23. సత్య గారు బాగా చెప్పారండి టపా చదివినంత సేపు మనసు ఏదో లా అయీపోయింది.ఎప్పుడు తెలుసుకుంటారు మనవాళ్ళు తమాషా గా పిచ్చి కామెంటులు తో ఆడుకుంటారు తప్ప అందులో ఎంతవరకు నిజం వుంది అన్ని తెలుసుకోరు ఎంతో పవిత్రురాలు అయీన సీతమ్మ ని పేరు పెట్టి పిలిచి యెంత దోర్భాగాయమైన రోజు నేడు

  ReplyDelete
 24. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 25. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 26. పై అనానిమస్ గారు మీ వాదన్ వింతగా, వితండంగా వుంది... వారి వారి వ్యక్తి గత విషయాలు వారి సొంతం, వారి గతం నాకైతే తెలియదు . అవసరం కూడా లేదు...
  వారి సమస్యకి విజ్ఞత తో కూడిన ఇంకో ఉపాయమో, పరిష్కారమో అలోచించి వుండాల్సింది...

  తన వైపు కాస్త న్యాయముందని భావించి వారి గోడవలకి వారి వ్యక్తిగత బాధలకి బహుషా పెద్ద ప్లాట్‌ఫార్మ్ కల్పించాలనుకున్నారేమో , కాని ఇది దుస్సాహసం, కునీతి, కుసంస్కారం....ఇలాంటి దుశ్చర్యల వల్ల, మంచివారి జాలిని , కనికరాన్ని కూడా కోల్పోతాం...స్వతాహగా మన అస్థిత్వాన్ని కోల్పొతాం..

  ఒకప్పుడు అశ్వథ్థామ, దుర్యోధనుడు నూరిపోసిన మాటలు విని, క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి, ఉపపాండవులునందరినీ నిద్రలో ఉండగా అతి దారుణంగా చంపుతాడు. నాలుగుగంటలు వీరంగం తో ఆ ప్రదేశాన్ని భీకరమైన రక్తసిక్తం గా మార్చేస్తాడు . చివరికి నిండు చూలాలిమీద, పుట్టబోయే బిడ్డమీదా దాడి చేయ బోతాడు.... ఓడిపోయి సిగ్గుతెచ్చుకొని చివరికి శాంతించి చింతించినా లాభం లేక అర్జునుని చేతిలో తీవ్ర పరాభానికి లోనై . తేజో విహీనుడుగా జీవచ్చవంగా దుర్భరమైన స్థితిని పొందుతాడు. తరువాత కనబడడు ...

  then, let them think of themselves !!!!

  ReplyDelete
 27. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 28. తల్లి సీతమ్మ గురించి ఇంత విపులం గా , చాలా మంచి వివరణతో రాసారు . చాలా చాలా థాంక్స్ నీల హంస గారు !
  చెత్త చదివి చదివి, అలసిన కళ్ళకు ఒక మంచి విషయాన్ని అందించారు .
  ఒక్క మాటలో చెప్పాలంటే మీ టపా "కన్నుల పండుగ " !!

  ReplyDelete
 29. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 30. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 31. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 32. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 33. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 34. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 35. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 36. Nijame..., ee post raasina meere Sita paathralo inthalaa leenamaithe... inka Valmiki inkentha feel ayyaado, madhana paddaado ani anipinchindi. anthe kaadu, valmiki Rama, Ravana, Hanuma, Vibheeshana ithyaadi paathralanniti characterisation kosam marentha feel ayi, madhana paduthoo raasaado ani anipinchindi.

  prathi sannivesam lo, aayaa paathralu aa sannivesam lo elaa pravarthisthaayanedi aa paathrala characterisation pai aadhaarapadi untundi. alaa characterisation prakaaram pravarthinchakapothe aa sannivesam pandadu.

  edi emainaa Thank You very much for publishing this post.

  nenu inthalaa raayalenu kaanee ilaantivi ishtam gaa chaduvuthaa...

  visleshinchukuntaa..., vimarsinchukuntaa..., aa paathra svabhaavam konchem maaristhe story ye rakamaina malupu thirigi undedi ani koodaa aalochisthaa... kaanee meelaa vyaktheekarinchalenu.

  ReplyDelete
 37. Very well written. చాలా బాగుంది.

  ReplyDelete
 38. nenu regular ga blogs chaduvutunna kaani ..comments ekkada wrayanu.....evarino target cheyyadaniki ee rakanga adda diddamaina prasnalu veyyadam vaalla murkhatwam...chala bada wrasaru...Thanks.

  ReplyDelete
 39. "క్షత్రియ వనితని, మహారాణిని, రామునితో సమానంగా భాధ్యతా యుతమైన పట్టమహిషిని, ఆడుతూ పాడుతు శివధనస్సుని జరపినదానని " ఈ మాటలు చదువుతుంటే నిజంగా సీతాదేవి అబల కాదు పరిపూర్ణ-సబల అని తెలుస్తుంది.
  సీతా మాతని అబలగా అలొచిస్తే తనకి అన్యాయం జరిగినట్టనిపిస్తుంది.
  కాని అందులో నిజం లేదని రామాయణం చదివితే తెలుస్తుంది.
  -- సత్య

  ReplyDelete
 40. Even if you keep the issue aside, the post is excellent!

  ReplyDelete
 41. "మేము పరస్పరం మాటలతో మాట్లాడుకోము ప్రవర్తనతో మాట్లాడుకుంటాం!" ఎంత బాగా చెప్పారు సత్య.

  ReplyDelete
 42. నిజమే సీతమ్మతల్లి అగ్నిప్రవేశం చేసి వునీత అనిపించుకుందీ లోకుల కోసమే రాముని కోసం కాదు రాముడు సీతమ్మని అనుమానించడు అనుమానిస్తే రాముడు కాడు

  ReplyDelete
 43. చాలా అద్భుతంగా వ్రాశారు నీలహంస గారూ. సాక్షాత్తు సీతమ్మ తల్లే మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. ఆ సీతారాముల కటాక్షం మీ కుటుంబంపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 44. మీ స్పందనకి కళ్ళు చెమ్మగిల్లాయి..ఓ సారి మా పర్ణశాల గుర్తుకు వచ్చింది..

  ReplyDelete
 45. ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే అధర్మాన్ని ఎదిరించి నిల బడగలరు. మరి ఎవరు ధైర్యస్థులు గా ఉండగలరు అంటే ధర్మాన్ని ఆచరించే వారు మాత్రమే. తాను చేస్తున్నది ధర్మమని నమ్మి న వారు మాత్రమే. మీకూ అలాంటి నమ్మకం ఉంటే మాతో చేతులు కలపండి. ఆబ్లాగుని, అలాంటి ధర్మ వ్యతిరేక బ్లాగులని తొలగించే ప్రయత్నం సమిష్టిగా చేద్దాం.

  అబ్లాగులోని Report Abuse అనే బటన్ ఉంది ఇటువంటి సందర్భాలలో ఉపయోగించడానికే. మీకు అది సరిఅయిన పనే అనే నమ్మకముంటే వీలైనంత త్వరగా ఆపని చేయడిం. కేవలం రాతలకే కాక చేతలకు దిగండి.


  మనకు నచ్చని, మన మనసు నొప్పించే కంటెంట్ ఉన్న ఏ బ్లాగునైనా బ్లాగరునుండి తొలగించ మని అడిగే హక్కు మనకు ఉంది. దానిని అందరం ఉపయోగించుకుందాం

  ReplyDelete
 46. I have done that. It qualifies to be reported as abuse under "Hate or violence".
  thanks for info.

  ReplyDelete
 47. ఆదరనీయిలైన

  రజేశ్ గారికి,
  నాగార్జున గారికి,
  దుర్గేశ్వర గారికి,
  వజ్రం గారికి,
  సతీశ్ గారికి,
  కావ్య గారికి,
  శంకర్ ఎన్ గారికి,
  మంజు గారికి,
  శ్రీనివాస్ గారికి,
  సుమలత గారికి,
  మిర్చ్‌బజ్జీ గారికి,
  శ్రీరామ్ గారికి,
  కుమార్ ఎన్ గారికి,
  శంకర్ గారికి,
  ప్రవీన గారికి,
  భరధ్వాజ గారికి,
  లక్ష్మీ నారాయణ సునీల్ గారికి,
  శివ చెరువు గారికి,
  రామరాజ్యం గారికి,
  మైత్రేయి గారికి,

  ఇంకాఎంతో మంది ఆదరనీయులైన అజ్ఞాతలందరికీ

  పేరు పేరు న వినయ పూర్వక ధన్యవాదాలు...
  పెద్దలందరికీ పాదాభివందనాలు..

  మీ ప్రోత్సాహం, అబినందన నాకెంతో ఊరటనిస్తున్నాయి సంతోషాన్నిస్తున్నాయి...


  ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ కలుగును గాక...

  "సంస్కృతి పై క్లేశాలేర్పడినప్పుడు ఆస్తిక పరమైన సంఘటితశక్తి మన కనీస అవసరమ"ని ఈ సంధర్భంగా విన్నవించు కుంటున్నా.

  || జై శ్రీమన్నారాయణ ||


  ( p.s :చర్చా వేదిక గా మార్చ బోయిన కొందని అజ్ఞాతల మరియి బ్లొగర్ల వ్యాఖ్య లని తొలగించాను దయ చేసి మన్నించ గలరు...ఇక ఆకతాయిలు, ఆతతాయులు సరేసరి!!)

  ReplyDelete
 48. అంతేలేండి సత్యగారూ
  అంతే
  అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు.
  నాకుమాత్రం చెప్పలేదు.
  పోనీలేండి. గుర్తుపెట్టుకుంటాలే.

  ReplyDelete
 49. అరరే!....రామ రాజు గారు,
  పొరపాటు జరిగింది..మన్నించండి...
  మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!..
  సదా మీ
  సత్య

  ReplyDelete
 50. It's really a great post that I ever seen

  ReplyDelete