సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".
రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.
ధర్మ పరిరక్షణం కోసం ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .
జీవితమంతా కష్టాలే. అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది.
కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.
ప్రతిజ్ఞ అంటే 'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.
భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.
ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’ భీష్మునిది.
అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.
ధర్మరాజే ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..
స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.
కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో,
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది.
విష్ణువు ముందే విష్ణువు ఆధ్వర్యంలోనే పాండవులకి ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.
ఆ విశిష్ట ధర్మ పరాయణుని అడుగుజాడలు సదా నా మదిలో.... అలాంటి పెద్దల పాద ధూలి సదా నా శిరస్సు పై ఉండును గాక.
-సత్య
|| శ్రీకృష్ణా శరణంమమ ||
బాగుందండి.
ReplyDeleteధర్మనిరతికి ప్రతీకగా భీష్మాచార్యులవారిని మీరు వర్ణించిన తీరు బాగుంది
ReplyDeleteraadihka gaaru thank you..
ReplyDeletedurgeswara garu ... welcome and thank you
ReplyDeleteసత్య గారూ
ReplyDeleteనమస్తే.
చక్కటి టపా. కమ్మని కావ్యం.
శుభాభినందనలు.
సుఖీభవ
భీష్ముని మహోన్నత వ్యక్తిత్వాన్ని చక్కగా వివరించారు.
ReplyDeleteభారతం చెప్పించుకుని అంతా విన్న అక్బర్, "వహ్వా! ఏక్ బుడ్ఢా(భీష్మ) ఔర్ ఏక్ బచ్చా(అభిమన్యు)" అంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వీరత్వాన్ని మెచ్చాడంటారు.
bhaskar gau .... SNKR garu ...many many thanks
ReplyDeleteచాలా చక్కటి వ్యాసం. మహా భారతం లో నాకు చాలా నచ్చిన పాత్ర భీష్ముడిది. ఈ వ్యాసం చదివాక ఆ గౌరవం రెట్టింపైంది.
ReplyDeleteThis piece, though short, is such a wonderfully written piece. Thanks so much!
ReplyDelete