2015/04/24

దాదాపు 1000 సం|| క్రితమే దలితులని ఆలయ ప్రవేశం చేయించిన పున్యాత్ములు.

ఇవ్వాళ భగవద్రామనుజ జయంతి (తిరు నక్షత్రం)...(24--4--2015)

భగవద్రామానుజులు అవతార పురుషులు, చైత్యన్య కారులు, వైషమ్య ద్వేషులు.

చరిత్రలో మొట్టమొదటి సారి (దాదాపు 1000 సం|| క్రితమే) దలితులని ఆలయ ప్రవేశం చేయించిన పున్యాత్ములు.
వేలకొలది వైష్ణవ ఆలయాల జీర్ణోధ్ధరణ చేసిన మహా పురుషుడు!

ఇప్పుడు మన అనుభవిస్తున్న సమ సమాన ఆలయ సందర్శణం , ప్రసాద వితరణ, సేవ ఆయన ఆజ్ఞ చలువే.
శ్రీరంగం నుండి తిరుపతి వరకూ వారు చేసిన జీర్ణోధ్దరణే!

అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిర్గతం చేసి, గోపురమెక్కి ఎలుగెత్తి చాటి, సర్వులకి సులభం చేసిన ఘనత భగవద్రామానుజులదే!
రెండు సంవత్సరాలలో వారు జన్మించి 1000 సం || పూర్తవుతుంది.!!

యావద్భారత జాతి , జగద్గురు భగవద్రామానుజులకి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది .
|| రామానుజాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం ||

-సత్య


No comments:

Post a Comment