2015/04/24

ఎగ"తాళి" !!



ముప్పై ఏళ్లక్రితం అప్పటి తరం పెద్దలు , ప్రేమ పేరుతోనో, ఆదర్శ వివాహం పేరుతో నో, సమాజాన్ని ఎదిరించి, ఎవరినా పెళ్లిల్లు చేసుకుంటే  పెడబొబ్బలు పెట్టారు-మొత్తుకున్నారు-బాధపడ్డారు.

అప్పుడు ఆ ప్రేమ పెళ్ళిలు చేసుకున్న ఈ తరం పెద్దలే , ఇప్పటి జంటలు  "సహజీవనం" (living relationship) చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు-మొత్తుకుంటున్నారు-బాధపడుతున్నారు.

పైగా "అసహజమైన" మార్పులని "ఇది సహజమే" అనే మూర్ఖులూ లేకపోలేరు.

ఒకప్పుడు స్త్రీ పురుషుల మధ్య సమానత్వానికి సంబంధిన్చిన "గొడవలు" ఉండకపొయేవి.  

స్త్రీ తన భర్త చనిపొతే ఎలాగైతే  బొట్టూ-తాలిబొట్టూ తీసేసేదో, అలాగే
భార్యని కోల్పోయిన పురుషుడు  కూడా తన బొట్టు ని తీసేసి, అలాగే రోజూ తన భుజాన ఎడమ వైపున వేసుకునే "కండువాని", ఎడమ నుండి కుడివైపుకుకి మార్చుకొని (భార్యా విహీనుడిగా) వ్యవరంచే వాడు. అది వారి సహజత్వానికి సరళత్వానికి ప్రతీక.
అది ఒకప్పటి సంస్కృతి- నగరికత  పై వారికున్న శ్రద్ద.అంతే!

నేడు పురుషుడు సప్రదాయబద్దంగా కనబడడు...

నేడు పురుషాధిక్యత వల్ల , పాశ్చాత్య విషధోరణుల వల్ల గత అరవై ఏళ్లుగా పురుషునిలో సాంస్కృతిక పరంగా చాలా మార్పులొచ్ఛాయి...
వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు!...

ఇంకో దురదృష్టం ఏంటంటే, సమానత్వం పేరుతో ఇప్పటి కొన్ని స్త్రీ-సమూహాలు కూడా "అధిపత్యం" కోసం ప్రయత్నించడం!!

నిజానికి కావల్సింది ఆధిపత్యం కాదని సమానత్వమని. స్థిరత్వమని వీరికి ఎప్పుడు అర్థమౌతుందో! (ఇద్దరికీ)

విషపరిణామం ఏమిటంటే "సామూహిక బాధ్యత" కరువవ్వడం! ( lack of collective responsibility )


ప్చ్.... "బాధ్యత లేని బతుకులతో భావితరాలని బలి తీసుకోవడం బాధాకరం!"

వీటిని అదునుగా చేసుకొని కుటిల మైన సాంస్కృతిక దాడులని చేసే రాజకీయ వర్గాలు, గత అరవై ఏళ్లుగా కొన్ని తుచ్చమైన పనులని చేస్తూనే ఉన్నయి...

అలాంటిదే ఈ తాళిని తెంపే నీచకార్యం.

ఒకప్పుడు తమిళ నాట రామాయణాన్ని తగలబెట్టడం జరిగింది.... ఇక్కడ రామాయ విషవృక్షాల నాటే ప్రయత్నం జరిగింది..ఇలా ఎన్నెన్నో... అస్తిత్వం-గుర్తింపూ-సంచలనాల పిచ్చి మనిషిని దిగజారుస్తూనే ఉంది.  

" రచ్చ చేసేవాళ్ళని రెచ్చ గొట్టే పని" ని మన మీడియా వాళ్లు "వ్యాపారం లో భాగంగా" నిర్లజ్జగా నిర్వహిస్తున్నారు.  

"సంస్కృతి పై క్లేశాలేర్పడినప్పుడు ఆస్తిక పరమైన సంఘటితశక్తి మన కనీస అవసరమ"ని మన "ఆధ్యాత్మ విజ్ఞులకి" ఎప్పుడు అర్థమౌతుందో ఏమో!
స్వస్తి.
-సత్య




1 comment:

  1. పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !!

    ReplyDelete