2015/04/17

చెడ్డకాలనికున్న మంచి తనం అదే....

చెడ్డకాలనికున్న మంచి తనం అదే,
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!     

సంసారసంద్రం లో సారమసలుండదు
ఎంత అలసినా ఆ ఈతకి తీరమసలుండదు
ఎన్ని సార్లు నచ్చ చెప్పిందో ఈ చెడ్డకాలం
బతుకుతీపికి మాత్రం అంతమసలుండదు      

చెడ్డకాలనికున్న మంచి తనం అదే,
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!   
  

బరువెక్కిన భారాల బంధాలు తెంపింది
అంతరంగాల మధ్య శూన్యాన్ని నింపింది
ఎన్ని సార్లు బుద్ధి 
 చెప్పిందో చెడ్డకాలం
మనసు మాత్రం మమతలతో దైన్యాన్ని చూపింది 

చెడ్డకాలనికున్న మంచి తనం అదే,
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!     

కాని కష్టాల కన్నీటిని తెప్పించింది 
దాగున్న విలువల వలువలు విప్పించింది
ఎన్ని సార్లు తేల్చి చెప్పిందో ఈ చెడ్డకాలం 
సుఖం మాత్రం నిజాలని అహాలతో తప్పించింది

చెడ్డకాలనికున్న మంచి తనం అదే,
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!    
 
-సత్య



3 comments:

  1. ఎంత అలసినా ఆ ఈతకి తీరమసలుండదు...ప్రతీ లైన్ విన్నూతనంగా రాసారు

    ReplyDelete
  2. ధన్యవాదాలు పద్మార్పిత గారు. చాలా సంతోషం

    :-)

    ReplyDelete
  3. ధన్యవాదాలు పద్మార్పిత గారు. చాలా సంతోషం

    :-)

    ReplyDelete